E-PAPER

ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ స్టేషన్లు; డీపీఓ చంద్రమౌళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసెంబర్ 10 వై 7 న్యూస్

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి తెలిపారు. మంగళవారం ఐడీఓసీలో గ్రామాల్లో పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రచురణ, ఎన్నికల నియమావళి పై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్‌డీఓ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్షి్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు జిల్లాలో చేపట్టబోతున్న ఏర్పాట్లను ఆయన వివిధ పార్టీల నాయకులకు వివరించారు. గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాల ఆధారంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితా షెడ్యూల్‌ ప్రకారం ప్రకటించనున్నట్లు చెప్పారు. మండల స్థాయిలో సంబంధిత ఎంపీడీవోల ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ నెల 12న సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ప్రకటించిన పోలింగ్‌ స్టేషన్లలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వరకు తెలియజేయాలన్నారు. ఎంపీడీవోల ద్వారా పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ఈనెల 17న ప్రచురిస్తామని తెలిపారు. జిల్లాలోని 479 గ్రామపంచాయతీలు, 42 32 వార్డుల్లో ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలకు అందుబాటులో పోలింగ్‌ స్టేషన్లను ఉంచుతామని అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని సూచించారు. త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి కోరారు. ఈ సమావేశానికి సిపిఐ నుంచి సలిగంటి శ్రీనివాస్, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నుంచి గౌని నాగేశ్వరరావు, టిఆర్‌ఎస్‌ నుంచి సంకుబాపన అనుదీప్, సిపిఎం నుంచి అన్నవరపు సత్యనారాయణ, బీఎస్పీ నుంచి జి.మల్లికార్జున రావు, బిజెపి నుంచి నోముల రమేష్,కాంగ్రెస్‌ నుండి లక్ష్మణ అగర్వాల్‌ హాజరైనారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్