E-PAPER

హైదరాబాద్ లో తన ప్రతిభను చాటున్న చిరంజీవి అభి

రాజమండ్రి,నవంబర్ 14 వై 7 న్యూస్

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్బంగా హైదరాబాద్ ఫిలిం నగర్ లోగల ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి
డా. డి రామానాయుడు కల్యాణ మండపంలో గురువారం చిరంజీవి సి హెచ్ అభి కూచిపూడి నృత్యం లో తన అపురూప కళా ప్రతిభను చాటుకుంది.రాజమండ్రి లో శివ సాయి కూచిపూడి నృత్య కాళాక్షేత్రం నిర్వాహకులు తణుకు సాయి మాధవి వారి ఆధ్వర్యంలో అనేకమంది చిరంజీవు లకు శిక్షణ నిస్తు రాజమండ్రి ప్రతిష్ట ను ఖండాన్తరాలకు వ్యాపింప చేస్తున్న నృత్య కళా పితామహి “సాయి మాధవి” వారికి కూచిపూడి కళామ తల్లి అభిమానుల తరుపున , ప్రసిద్ధి సాహితి నగరం రాజమండ్రి ప్రజల తరుపున ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాము.చిరంజీవి అభి తో పాటుగా వారి ప్రతిభను కనపరచిన తోటి బాలిక నృత్య కారులను పలువురు అభినందనలతో ముంచేత్తారు . శివ సాయి కూచిపూడి నృత్య కళా క్షేత్రం చిన్నారులైన జోషికా సింగ్, దాన్యశ్రీ , శాన్విశ్రీ, లేఖన, సహస్ర , ఎషిత లకు మంచి భవిష్యత్ వుంటుందని పెద్దలు ఆశీర్వదించారు.
సాహితీ నగరం అయిన రాజమండ్రి ప్రస్థానాన్ని అనేక ప్రాంతాలకు వ్యాపింప చేస్తున్న శివ సాయి కూచిపూడి నృత్య కళా క్షేత్రం వారికి రాజమహేంద్రి యూత్ సర్కిల్ తరుపున హృదయ పూర్వక అభినందనలు డాక్టర్. కే వర ప్రసాద్ తెలియజేశారు ..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్