ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.
మణుగూరు,అక్టోబర్ 15 వై 7 న్యూస్;
సింగరేణి ప్రాంతమైన మణుగూరు ఏరియా లో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏరియాలో ఉన్న సింగరేణి కార్మిక వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను పరిష్కరించే విదంగా చొరవ చూపాలని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి తెలియచేశారు..సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఇచ్చిన అత్యంత ముఖ్యమైన హామీలు నెటి వరకు ఏ ఒక్కటి నెరవేరలేదని వాటి ప్రస్తావన కరువైందని తెలిపారు.2023_2024 అర్ధిక సంవత్సరానికి కార్మికులు సమిష్టి కృషి ద్వారా ఏరియా కు 2315 కోట్లు లాభాలు సాధించిపెట్టినప్పటికీ సంక్షేమం అంశంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఆరోపించారు స్ధానిక.సింగరేణి పాఠశాలలో సి బి యస్ ఈ సిలబస్ పైలెట్ ప్రాజెక్టు గా గుర్తించి అమలు చేయాలని డిమాండ్ చేశారు,సింగరేణి ఆసుపత్రి రిఫరల్ కేంద్రంగా తయారైందని డాక్టర్స్ కొరత వేధిస్తుందని ముఖ్యంగా యువ కార్మికులు అధికంగా ఉన్న చోట పిల్లల వైద్య నిపుణులు లేకపోవడం వల్ల యువ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.. మణుగూరు సింగరేణి ఆవిర్భవ సమయంలో నిర్మించిన క్వార్టర్లలోనే నేటికీ కార్మికులు నివాసాలు ఉంటున్నారని ఆ క్వార్టర్ లలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం దాపురిస్తుందేమో అని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతులు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారని కొత్త క్వార్టర్ ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు… కాలనీ ఏరియాలో అంతర్గత రోడ్లు పూర్తిగా అధ్వానంగా తయారైనయని పట్టించుకునే నాధుడే కరువాయుడని ఆయన తెలిపారు.. మణుగూరు సింగరేణి నుంచి భద్రాద్రి పవర్ ప్లాంట్ కు నిత్యం వందలాది లారీలు తిరగడం వల్ల ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిందని మోకాలోతు గుంటలు ఏర్పడి నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతునే ఉందని ప్రజల విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని .ప్రధాన రహదారి వెంబడి లైట్లు లేకపోవడం వల్ల నియోజవర్గ ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.. గోదావరి నుంచి వచ్చే తాగునీరు నిల్వకు సరిపడ ట్యాంకులు లేవని తెలియజేశారు..మణుగూరు ఏరియా మనుగడ సాగించాలంటే కొత్త గనులు ఏర్పాటు చేయాలని సూచించారు..కొండాపురం భూగర్భ గని ఫిట్టర్ ట్రాన్స్ ఫర్ ఆర్థర్ ను పూర్తి స్థాయిలో రద్దు చేసి కొత్తగూడెం ఏరియా లో రిపోర్ట్ చేసిన వారిని తిరిగి మణుగూరు ఏరియా కు బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు..మణుగూరు సింగరేణి ప్రగతి లో సింగరేణి కార్మికులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ మరువలేనిదని వారికి సింగరేణి క్యాంటీన్ లలో తినుబండరాలకు అవకాశం కల్పించే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపాలని అయన డిమాండ్ చేశారు