కామేపల్లి,అక్టోబర్06 వై 7 న్యూస్;
కామేపల్లి మండలం గోవింద్రాల, పండితాపురం కొత్త కాలనీ సెంటర్ లో జరిగిన బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నాడు జరిగిన నవరాత్రి ఉత్సవ కార్యక్రమం లో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం దుర్గాదేవికి నైవేద్యం, నీరాజనం సమర్పించారు.ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని, అమ్మవారి కరుణాకటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని, రాముడు రావణుడిని సంహరించిన సందర్భంగా, పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు దాచిన ఆయుధాలను విజయదశమి పండుగ నాడు అమ్మవారికి పూజ చేసి తీసుకోవడం వలన వారికి విజయం లభించిందని, చెడుపై మంచి విజయం సాధిస్తుందని ఈ పండగ యొక్క ప్రత్యేకత అని దసరా యొక్క విశిష్టతను తెలియజేశారు. బతుకమ్మ తెలంగాణ గౌరవానికి సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు లక్ష్మీనారాయణ,మేకల,మల్లికార్జునరావు భూక్య నాగేంద్రబాబు బాదావత్ నాగరాజు, నరసింహ చారి భీమానాయక్, గోపి సత్యనారాయణ గంగారపు సైదులు, గొడవర్తి రామారావు గంగారపు అప్పయ్య, కిషన్ ఉపేందర్ రవి వీర నాగులు,శివాజీ నగేష్ విజయ్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.