E-PAPER

ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ డే ఉత్సవాలు

బాన్సువాడ,సెప్టెంబర్ 24 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి ;

బాన్సువాడ పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా ఎన్ఎస్ఎస్ విభాగాల తరఫున కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వేణుగోపాల స్వామి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని తద్వారా వ్యక్తిత్వ వికాసం తో పాటు సామాజిక సమస్యలు తెలుస్తాయని, తద్వారా సామాజిక సంబంధాలు మెరుగు అవుతాయని పేర్కొన్నారు. ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు గా కళాశాలలో శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని మరియు గ్రామాలలో శ్రమదానం తో పాటు మూఢనమ్మకాలు, అంటురోగాలు, ఎయిడ్స్ నివారణ నివారణ గురించి గ్రామస్తులలో చైతన్యాన్ని గ్రామస్తులలో చైతన్యాన్ని తీసుకొని రావాలని, కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని గ్రామస్తులను చైతన్యం చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2,3 విభాగాలకు చెందిన 200 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారులకు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. యూనిట్ ప్రోగ్రాం అధికారులు పోతరాజు శ్రీనివాస్, డాక్టర్ రాజేష్ ఎల్ జి ఏ సి కోఆర్డినేటర్ వినయ్ కుమార్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :