ప్రకాష్ నగర్ వార్డు పలు సమస్యలు తీర్చే నాధుడు ఎవరు?
. తాత్కాలిక పరిష్కారం అయినా కరువు.!
మిర్యాలగూడ,సెప్టెంబర్ 22 వై7 న్యూస్ తెలుగు
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ లో గల 8,9 వ వార్డులో ప్రజల సమస్యలను పట్టించుకునే నాధుడు లేడు అంటున్న వార్డు ప్రజలు. అధికార పార్టీ గానీ,ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు.గత కొంతకాలం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు అన్ని గుంతల మయంగా అయ్యాయి.వందల కుటుంబాలు ఈ వార్డులో బతుకుతున్నారు.పని నిమిత్తం వస్తూపోవాలంటే ఈ రోడ్డు మీద నరకయాతన అనుభవిస్తున్నారు.స్కూల్ బస్సులు గానీ,ఆటోగాని వార్డుకు రావాలంటే భయపడుతున్నారు.చీకటి పడితే గుంతలో పడి ప్రమాదానికి గురవుతున్నారు. చినుకు పడితే చిత్తడే అన్నట్లు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.అదేవిధంగా 9వ వార్డు గవర్నమెంట్ స్కూల్ దగ్గర మెయిన్ రోడ్డు మీద డ్రైనేజీ ర్యాంప్ రెండు నెలల కింద గుంత పడింది.అక్కడ చుట్టుపక్కలచిన్నపిల్లలు,వృద్ధులు,స్కూల్ విద్యార్థులు తిరుగుతూ ఉంటారు. కాలుజారి అందులో పడి జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరు?ఈ విషయంపై అధికార పార్టీ వార్డు ఇన్చార్జిలను అడగగా మున్సిపాలిలో నిధులు లేవు మేమేం చేయము అని చేతులెత్తేస్తున్నారు. అసలు ఈ వార్డులో కౌన్సిలర్ కూడా లేరు. మా సమస్యలను తీర్చే నాధుడు ఎవరు? అంటూ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు, మున్సిపాలిటీ అధికారులు,అధికార పార్టీ నాయకులు మున్సిపాలిటీ నిధులు వచ్చేవరకు అయినా సమస్యలకు తాత్కాలిక పరిష్కారం చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.









