E-PAPER

నల్గొండ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించిన సామల రవి ప్రసాద్

మిర్యాలగూడ సెప్టెంబర్ 22 వై7 న్యూస్ తెలుగు

నల్గొండ జిల్లా విద్యుత్ కార్యాలయంలో నూతనంగా, డివిజనల్ ఇంజనీర్ విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ ఇన్చార్జి గా సామల.రవిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా, విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమం సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో విద్యుత్ బిసి సంఘం వారు కలిసి పుష్ప పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమం సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్ మాట్లాడుతూ సామల రవిప్రసాద్ ఎలక్ట్రికల్ డివిజనల్ ఇంజనీర్ గా యాదాద్రి జిల్లా లో .ఎం అండ్ పి. మరియు టిఆర్ఈ గా బాధ్యతలు చేయుచున్నారని ,వీరికి ఎస్ఈగా ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా ఘనంగా బొకే, నేత టవల్ తో ఘనంగా సన్మానించారు. ఎస్ ఇ ఇన్చార్జ్ రవి ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఉద్యోగులు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని వినియోగదారులు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని వినియోగదారులు ప్రతినెల మీకు సంబంధించిన కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించాలని వినియోగదారులకు రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యుత్ బిసి సంఘ వారు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంజి వెంకన్న, ఊటుకూరి గిరి, జిల్లా, డివిజన్ కార్యవర్గం. విద్యాసాగర్, రవికుమార్, సత్యనారాయణ, ఈశ్వర్, విశ్వం, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, బి వెంకటేశ్వర్లు, శంకరయ్య, హరికృష్ణ, కుమార్, కోటి, లింగయ్య, కృష్ణ, రాజు, మాధవాచారి, తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!