మిర్యాలగూడ,సెప్టెంబర్22 వై7న్యూస్
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సౌకర్యాలు, భోజనాల ఏర్పాట్లపై విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల బోజనాలను పరిశీలించారు.
అనంతరం మెనూ అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత లేకపోవడంతో వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టోరూం లో ఉన్న కూరగాయలు నాణ్యత లేకపోవడంతో కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.హాస్టల్లో భోజనాలు సక్రమంగా లేకపోవడంపై అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. హాస్టల్ వార్డెన్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు నేరుగా ఫోన్ చేయాలని ఫోన్ నెంబర్ ఇచ్చారు.
Post Views: 125









