కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులలో వివిధ రకాల పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్స్ తో పాటు ఇతర రక్షణ సామాగ్రి తక్షణమే పంపిణీ చేయాలని సేవ్ కొత్తగూడెం మున్సిపాలిటీ అంటున్నారు జలాల్ అన్నారు. నేడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై మూడో నెల గడుస్తున్నప్పటికీ ప్రస్తుతం భారీ తుఫాను నడుస్తున్నప్పటికీ కార్మికులకు రైన్ కోట్స్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం ముగిసినక ఇస్తారా ఏంటి అని ఆయనే ప్రశ్నించారు. తక్షణమే వారికి రైన్ కోర్స్ తో పాటు ఇతర రక్షణ సామాగ్రి పంపిణీ చేయాలని ఆయనే డిమాండ్ చేశారు.
Post Views: 26