. ఒకపక్క ఏసీబీ దాడులు జరిగిన సిగ్గు రావడం లేదు
. లక్షల రూపాయల జీతం సరిపోక బల్ల కింద చేయి పెడుతున్నారు
. ఏసీబీ వలలో మరో లంచగొండి విద్యశాఖ డిఈ
స్టేషన్ ఘన్ పూర్ ,ఆగస్టు31 వై 7 న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవినీతి పందికొక్కులు రోజురోజుకు పెరిగి పోతున్నారు ఒకపక్క ఏసీబీ దాడులు జరుగుతూ అనేకమంది పట్టు బడుతున్న మరో పక్క ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు రావడం లేదు బల్ల కింద చేయి పెట్టకుండా నోట్లో ముద్ద మింగుడు పోవడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజల పన్నులతో లక్షల రూపాయల జీతాలు పొందిన డబ్బు సంపాదన ఆశ సరిపోవడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలి అంటూ వెళ్లిన ప్రతి ఒక్కరి దగ్గర ముందు లంచం లేనిదే పని జరగడం లేదనే సమాచారం గట్టిగా వినిపిస్తుంది. వివరాలకి స్టేషన్ ఘన్పూర్ విద్యుత్ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసిబి వలలో పడింది.20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన విద్యుత్ శాఖ DE హుస్సేన్ నాయక్ .జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ విద్యుత్ శాఖలో( TGNPDCL డీఈ ఆపరేషన్స్ ) గా పనిచేస్తున్న హుస్సేన్ నాయక్.కరెంట్ లైన్ మార్చడానికి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విద్యుత్ అధికారి.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు 16 లక్షల డీడీ కట్టి, 16 నెలలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రైతు కుంభం ఎల్లయ్య.లైన్ షిఫ్టింగ్ కొరకు రైతు దగ్గర రూ.20,000 లంచం అడిగిన డీఈ హుస్సేన్ నాయక్.రూ.20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డీఈ హుస్సేన్ నాయక్.రైతు భూమిలో ఉన్న 33 KV లైన్ ను ప్రక్కకు మార్చడం కొరకు,LC పొందటం కొరకు 20 ,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు.రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగాఎం.హుస్సేన్ నాయక్ ను దాదాపుగా 5 గంటలు ఎదురుచూసి చాకచక్యంగా పట్టుకున్న ఎ సి బి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ ఆపరేషన్ లో వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య సిఐలు సట్ల రాజు, శ్యాంసుందర్, ఎల్ రాజులు పాల్గొన్నారు