E-PAPER

రుణమాఫీ కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు జరగబోయే ధర్నా ను జయప్రదం చేయండి

రుణమాఫీ కొరకు నేడు తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్ట బోయే ధర్నా ను రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని ఆ పార్టీ మండల కార్యదర్శి యస్ కె యాకుబ్ కోరారు బుధవారం మండల పరిధిలోని కట్టవారి గూడెం గ్రామం లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన పాల్గొని మాట్లడుతూ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని కోరారు
ఎన్నికల్లో హామీ మేరకు ప్రతి ఒక్కరికి రుణ మాఫీ చేస్తామని చెప్పి రుణ మాఫీ చేయకుండ సర్వే ల పేరుతొ కాలయాపన చెయ్యటం సరిఅయింది కాదు అని అన్నారు ప్రభుత్వం తక్షణమే పునరాలోచించి ప్రతి రైతుకు రుణ మాఫీ చెయ్యాలని కోరారు అలాగే నేడు జరగబోయే ధర్నా ను రుణ మాఫీ కానీ రైతులు ధర్నా కార్యక్రమం లో పాల్గొనాలనికోరారు ఈ కార్యక్రమంలో పటాన్ మై బల్లి మీసాల మట్టయ్య గూడపు లక్ష్మయ్య రాయిరాల శ్రీనివాస్ ప్రసాద్ కిరణ్ పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్