E-PAPER

‘భోగి’ సినిమాపై శర్వానంద్‌ ధీమా.. ఎలాంటి ఒత్తిడి లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్‌ హయాతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు కొంత ఒత్తిడి ఉంటుందని, కానీ ‘భోగి’ విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి, భయం లేవని తెలిపారు. సినిమా ఫస్ట్‌ కాపీ చూసినప్పుడే ఎంతో సంతృప్తి కలిగిందని, ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమాతో నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు సంపత్‌ నందికి శర్వానంద్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘భోగి’ తన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!