E-PAPER

పలాస మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వజ్జ గంగాభవాని ప్రమాణ స్వీకారం

శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు:

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 5వ చైర్‌పర్సన్‌గా వజ్జ గంగాభవాని సోమవారం ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ కార్యక్రమానికి హాజరై గంగాభవానికి శుభాకాంక్షలు తెలిపారు.

చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వజ్జ గంగాభవాని మాట్లాడుతూ.. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తాననే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వజ్జ గంగాభవాని 8,846 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టడంతో జంట పట్టణాల అభివృద్ధిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!