ములుగు జిల్లా నవంబర్ 21 Y7 న్యూస్ తెలుగు

ములుగు జిల్లాలో శనివారం ములుగు మండలం ఇంచెర్ల గ్రామంలోని రైతువేదికలో మంత్రి దనసరి అనసూయ సీతక్క ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో మరణం సంభవిస్తుందో తెలియదని, కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడకుండా రూ.5 లక్షల బీమా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు సాధారణంగా కొన్ని బీమా పథకాలు ఏడాది లేదా రెండేళ్ల కాలపరిమితికి మాత్రమే వర్తిస్తాయని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మాత్రం దీర్ఘకాలిక భరోసా కల్పించే ఉద్దేశంతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారిలో ప్రతి కుటుంబం నుంచి ఒకరి పేరును నమోదు చేసుకోవచ్చని, నామినీ వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు. ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం ఏదైనా పథకం నిబంధనల ప్రకారం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుందని వివరించారు ఇప్పటికే ఇతర బీమా పథకాల్లో ఉన్నవారు కూడా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చని, ప్రస్తుతం పొందుతున్న బీమా ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల బీమా సౌకర్యం ఇప్పటికే ఉందని, ఆ ప్రయోజనాలు కూడా కొనసాగుతాయని తెలిపారు ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. గ్రామస్థాయిలోనే నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని సమయం తెలియలేదనే కారణంతో ఎవరూ పథకానికి దూరం కావద్దన్నారు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని ఎంపీడీవో కార్యాలయం గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మంత్రి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్ను ఆవిష్కరించారు. పథకంలో తొలి ఆన్లైన్ నమోదు ప్రక్రియను చేపట్టి, నమోదు పత్రాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ ములుగు డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి సీపీఓ సర్పంచులు సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు








