సామజవరగమన వంటి సాలిడ్ హిట్ తర్వాత శ్రీవిష్ణు , రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న మరోసినిమా ఫ్యామిలీ ప్యాక్. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాని వచ్చే ఏడు పొంగల్ బరిలో దించబోతున్నామని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.
అయితే ఈ సినిమాకి ఇదే టైటిల్ ఎందుకు పెట్టారంటూ అప్పుడే సోషల్ మీడియాలో డిబేట్ మొదలైపోయింది.దీంతో అసలు ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టామంటే అంటూ ఈ సినిమాలో నటించిన నటీ నటులు సరదాగా ఇలా సమాధానం చెప్పుకొచ్చారు.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాక్షి మదోల్కర్ మాట్లాడుతూ అదో పెద్ద స్టోరీ అని చెప్పగా,కమెడియన్ సుదర్శన్ మాట్లాడుతూ దేవుడు డైరెక్టర్ కళ్ళలోకి వచ్చి ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా అని, అందుకే ఈ సినిమాకి ఫ్యామిలీ ప్యాక్ అని పెట్టారని సరదాగా చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న బుల్లి రాజు చెబుతూ ఈ సినిమా కథలో ఫ్యామిలీకి ఆకలై బిర్యాని ఆర్డర్ పెట్టుకుంటారని, అయితే ఆ పార్సిల్ తెచ్చిన వాడు దొంగ కావడంతో ఆ ఫ్యామిలీ అంతా కలిసి వాణ్ణి ఫ్యాక్ చేయడం వల్ల ఈ సినిమాకి ఫ్యామిలీ ఫ్యాక్ అని పెట్టరాని చెబుతూ నవ్వులు పూయించాడు.
ఇక కమెడీయన్ సత్య మాట్లాడుతూ ఈ సినిమాకి చాలా టైటిల్స్ అనుకున్నామని ,అయితే ఈ మధ్య ఏ టైటిల్ పెట్టినా లాస్ట్ లో మార్చేస్తున్నారని అంటున్నారని ,అందువల్ల ఫ్యామిలీ అనే టైటిల్ పెడితే ఎమోషనల్ అయి మార్చరని అందుకే ఈ సినిమాకి ఫ్యామిలీ ప్యాక్ అనే పేరు పెట్టామని సరదాగా చెప్పుకొచ్చాడు.
ఇక సినిమాలో కీ రోల్ పోషిస్తున్న అభిరామి చెబుతూ సినిమాకి మొదట్లో ఫ్యామిలీ క్రాక్ అని ఉందని,కానీ న్యూమరాలజీ కుదరక పోవడంతో ఇలా ఫ్యామిలీ ఫ్యాక్ అని అయినా ఈ స్మార్ట్ అండ్ మోడరన్ డేస్ లలో కూడా ఇంకా ఈ న్యూమరాలజీ చూడటం ఏంటో అంటూ సెటైర్ వేశారు.
ఇక సీనియర్ నరేష్ చెబుతూ ఈరోజులో ఫ్యామిలీ అంటే చాలా గ్రాంటెడ్ అయిపోయిందని,ఎప్పుడూ లవ్ స్టోరీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ స్టోరీస్ కి కూడా వాల్యూ ఇవ్వాలని, అందుకే ఇలా ఫ్యామిలీ ఫ్యాక్ అనే సినిమా అని సెలవిచ్చారు.
ఇక చివరగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ థియేటర్ లోకి ఫ్యామిలీస్ అందరూ ప్యాక్డ్ గా వచ్చి చూడాలని ,అందుకే ఫన్ తో పాటు ఆల్ ఎలిమెంట్స్ ని బాగా ఫ్యాక్ చేశామని అందుకే సినిమాకి ఫ్యామిలీ ఫ్యాక్ అనే టైటిల్ పెట్టామని చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు .ఇక ఈసారి వచ్చే సంక్రాంతి మామూలు సంక్రాంతి కాదని, ఫ్యామిలీ ప్యాక్డ్ సంక్రాంతి అని అందరిని నవ్వించాడు.
ఇక చివరగా ఈ సినిమా నుండి వరుస అప్ డేట్స్ వచ్చేస్తాయని హింట్ ఇచ్చేసింది మూవీ టీమ్ .చూడాలి మరి గతేడాది నారీ నారీ నడుమ మురారి అంటూ సాలిడ్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు వచ్చే సంక్రాంతికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో !








