E-PAPER

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్

ములుగు జిల్లా నవంబర్ 21 Y7 న్యూస్ తెలుగు

ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు స్టేషన్ ఆవరణ వివిధ విభాగాల నిర్వహణ రికార్డులు కేసుల రికార్డ్స్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించాలని సూచించారు ప్రజలు తమ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి మర్యాదపూర్వకంగా స్పందించి, చట్టపరిధిలో సత్వర న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు ఈ తనిఖీలో ఏఎస్పీ ఏటూరునాగారం మానన్ భట్ ఐపీఎస్,డి సి ఆర్ బి డి ఎస్ పి కిషోర్ కుమార్,సీఐ సూర్యప్రకాశ్, ఎస్ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!