E-PAPER

పలాసలో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్

పలాస: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 21న పలాస కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాధురి వెల్లడించారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులతో న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఎన్‌ఐ) చట్టం కింద నమోదైన చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు.

సంబంధిత కేసుల్లో రాజీకి ఆసక్తి ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, చిట్‌ఫండ్ ప్రతినిధులు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు, కోర్టు గుమస్తాలు, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

— Y7 News Telugu | శ్రీకాకుళం జిల్లా, పలాస

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!