చింతూరు, ( వై7 న్యూస్ తెలుగు), అక్టోబర్ 02: స్థానిక జెడ్ పి టి సి, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా పోలీస్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేసారు. పోలీస్ ఉన్నతాధికారులైన జిల్లా ఎస్పీ చక్రవర్తి, ఏ ఎస్ పి ఉదయ పావని ఆదేశాల మేరకు చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్ ఎర్రం పేట గ్రామంలోని 328 జాతీయ రహదారి మూల మలుపు వద్ద చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మద్యం, ప్రత్యేక బహుమతులు,చీరలు, పైకం(క్యాష్) ఇతరత్రా బహుమతులు ఓటర్లకు పంపిణి చేయకుండా నిరోధించటానికి ఈ చెక్ పోస్ట్ ను ప్రారంభించినట్లు సిఐ గోపాలకృష్ణ, ఎస్ఐ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే కేసులు పెడుతున్నామని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కచ్చితంగా ఉండాలని, లేనిచో వాహనాన్ని సీజ్ చేస్తామని, కేసులు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ, యస్ ఐతో పాటు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








