E-PAPER

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక.. చైర్మన్‌గా కోడెల నరేష్

నవంబర్ 1, Y7 న్యూస్ తెలుగు: జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ట్రస్ట్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించే లక్ష్యంతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.

నూతన కమిటీ చైర్మన్‌గా కోడెల నరేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా మునిగల రాకేష్, బండపెల్లి రవి గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఉపాధ్యక్షులుగా పుల్లంశెట్టి అజయ్ కుమార్, కస్ప ముకుందం, యర్రంగారి వీరన్ కుమార్, గంగుల చంటిని ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా పున్నెం భాస్కర్, గోలి నరేష్, నిమ్మల నరేష్ ఎంపికయ్యారు.

కోశాధికారులుగా ముప్పారపు రాజు కుమార్, లిక్కి రమేష్, నూతులకంటి ఈశ్వర్ చందు, ప్రచార కార్యదర్శులుగా గగ్గూరి మహేష్, మహ్మద్ ఖాజా, మామిల్ల నాగరాజును ఎన్నుకున్నారు.

గౌరవ సలహాదారులుగా కోలగట్ల నరేష్ రెడ్డి, చాద మల్లయ్య, ఎం.డి. గఫార్ ఖాన్, కళ్లెబోయిన సురేష్, సిద్ధంశెట్టి కనకారావ్, కోమరిగిరి కేశవరావు, ఇప్పాల నరేష్, ముప్ప మోహన్ రెడ్డి, సయ్యద్ బాబాలను ఎంపిక చేశారు.

కార్యవర్గ సభ్యులుగా వడ్లకొండ నాగేందర్, సాంబశివరావు, నాని, లోహిత్, శ్రావణ్, సిద్ధు, పానెం నర్సింహారావు, ఎర్రావుల కృష్ణ, ఇంతియాజ్, అప్రోజ్ ఎన్నికయ్యారు.

నూతన కమిటీ ఏర్పాటుతో ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో నూతన కమిటీ సమష్టిగా పనిచేయనుంది.

Y7 NEWS TELUGU
ప్రజల గొంతుక.. నిజం వైపు పయనం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!