E-PAPER

పేద విద్యార్థులకు అండగా సింగరేణి రైల్వే సైడింగ్ కాంట్రాక్ట్ కార్మికులు

మణుగూరు, నవంబర్ 1: సామాజిక సేవలో మణుగూరు ఏరియా సింగరేణి రైల్వే సైడింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఆదర్శంగా నిలిచారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం 150 కిలోల బియ్యం, పండ్లను పంపిణీ చేసి తమ సేవా నిరతిని చాటుకున్నారు.

ఆదివారం మధ్యాహ్నం సంతోష్ నగర్‌లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి డీజీఎం (సివిల్) గరిమెళ్ల శివప్రసాద్ కార్మికుల సేవలను అభినందించారు.

దసరా ఉత్సవాల నిర్వహణ కోసం సేకరించిన నిధుల్లో ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని పేద విద్యార్థుల కోసం వినియోగించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన కార్మికుల సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయంగా రూ.17 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి సివిల్ డిపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్లు ఈ.ఈ. రామ్ చరణ్, జె. నవీన్ కుమార్, వత్సవాయి రవి వర్మ, కార్యక్రమ సమన్వయకర్త ఏ. మంగీలాల్, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు కె. గురుమూర్తి, ఎం. సాంబశివరావు, యు. శివరామకృష్ణ, ఐ. గోపి, డి. రామకృష్ణ, ఎం. గురుప్రసాద్, పాఠశాల నిర్వాహకులు బి. జగన్మోహన్ రెడ్డి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!