E-PAPER

మణుగూరు విద్యార్థికి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

మణుగూరు: SGF ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అండర్-14 బాలుర పాఠశాలల క్రీడా పోటీల్లో మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కో-ఎడ్యుకేషన్) విద్యార్థి మడకం ఉమేష్ ప్రతిభ కనబరిచాడు.

పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఉమేష్ డిస్కస్ త్రో విభాగంలో ప్రథమ స్థానం, షాట్‌పుట్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించాడు. ఈ విజయంతో నవంబర్ 10, 11 తేదీల్లో హన్మకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు.

విద్యార్థి సాధించిన విజయంపై పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కోడి ఆది నారాయణ, ప్రధానోపాధ్యాయులు G. నాగశ్రీతో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఉమేష్‌ను అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, మణుగూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!