శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా, చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ఎన్నికల కోసం మొత్తం 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
– మొత్తం ఓటర్లు: 49,420
– మహిళా ఓటర్లు: 25,620
– పురుష ఓటర్లు: 23,793
– ఇతరులు: 7
మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో స్థానికంగా ఎన్నికల సందడి మొదలుకానుంది. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.
Y7 న్యూస్ తెలుగు | ప్రజల గొంతుక
Post Views: 9








