ఈ నెల 16న జరిగే సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: యాదవ సంఘం పెద్దలు
మద్దికేర, అక్టోబర్ 14 (వై7 న్యూస్ తెలుగు):
మండల కేంద్రమైన మద్దికేరలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న యాదవ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను యాదవ సంఘం పెద్దలు విడుదల చేశారు. స్థానిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్ద శుక్రవారం ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
యాదవ కుటుంబాల మధ్య ఆత్మీయత, ఐక్యత, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని యాదవ సంఘం కుటుంబ సభ్యులు, యాదవ సోదరులు, సోదరీమణులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పోస్టర్ విడుదల కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దలు పాల్గొన్నారు.
— వై7 న్యూస్ తెలుగు
Post Views: 20








