E-PAPER

అమ్మగారిపల్లిలో పశు వైద్య శిబిరం.. పాడి రైతులకు వైద్య సేవలు

అశ్వాపురం, అక్టోబర్ 14 (Y7 న్యూస్ తెలుగు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాల ఆవరణలో బుధవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో గ్రామ సర్పంచ్ ఇర్పా కవిత, మండల పశు వైద్యురాలు ఎస్.కె. ఫర్హీన్ బేగం సమక్షంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు.

శిబిరంలో పశువైద్యులు గేదెలకు చూడు పరీక్షలు నిర్వహించి గర్భధారణను నిర్ధారించారు. గర్భకోశ సంబంధిత వ్యాధులకు మందులు అందించడంతో పాటు దూడలు, జీవాలకు నట్టల నివారణ మందులు తాగించారు. పాలు ఇచ్చే గేదెల సంరక్షణ, పోషణపై పాడి రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఇర్పా కవిత మాట్లాడుతూ, పశు వైద్య శిబిరాల నిర్వహణతో పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటి పోషణకు కూడా దోహదపడుతుందని తెలిపారు. గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించినప్పుడు పశువులు ఉన్న ప్రతి రైతు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జామ నాజర్, పంచాయతీ కార్యదర్శి జహిర్, పశు వైద్య సిబ్బంది ఓఎస్‌లు జగదీష్, రాజబాబు, గోపాలమిత్రలు నాగరాజు, అరవింద్‌తో పాటు రైతులు పకీరా రెడ్డి, నాగిరెడ్డి, రామారావు, నాగరాజు, రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, లాల్ బీ, విజయ, రమణ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!