E-PAPER

రూ.80 వేల అప్పు వివాదం.. రవిచంద్ర హత్య కేసులో నిందితుడి అరెస్ట్

కరకగూడెం, అక్టోబర్ 14 (Y7 న్యూస్ తెలుగు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని కలువల నాగారం గ్రామానికి చెందిన బాధావత్ రవిచంద్ర హత్య కేసులో నిందితుడు మహమ్మద్ ఇమ్రాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రూ.80 వేల అప్పు విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదీ రాత్రి రవిచంద్రను మోటార్‌సైకిల్‌పై గ్రామ శివారుకు తీసుకెళ్లిన ఇమ్రాన్.. బెల్టుతో గొంతు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఈ ఘటనపై మృతుడి తల్లి బాధావత్ విజయ ఈ నెల 12న కరకగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా ఈ నెల 14న నిందితుడిని అతని ఇంటి వద్ద అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించినట్లు పేర్కొన్న మోటార్‌సైకిల్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.

ఈ హత్య కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!