మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు
పలాస, Y7 న్యూస్ తెలుగు:
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో తాగునీటి పైప్లైన్ లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. పాత జాతీయ రహదారిపై మసీదు జంక్షన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పలు చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. అదేవిధంగా కేటీ రోడ్, పురుషోత్తపురం కల్వర్టు వద్ద కూడా పైప్లైన్ లీకేజీలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు లీకేజీలు ఉన్న ప్రాంతాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను స్వయంగా పరిశీలించారు. తాగునీరు వృథా కాకుండా లీకేజీలకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
Post Views: 13








