BREAKING NEWS లారీ, జేసీబీ పట్టివేత.. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే అక్రమ రవాణా!
బూర్గంపాడు,అక్టోబర్ 14 (వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్న లారీతో పాటు జేసీబీని పట్టుకున్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతుండటంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగిన తర్వాతే చర్యలు కనిపిస్తున్నాయా? అంటూ కొందరు స్థానికులు పోలీసుల నిఘాపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరోవైపు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందినప్పుడు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, పోలీస్ స్టేషన్కు సమీపంలోనే జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం ఎందుకు అందలేదన్న చర్చ మండలంలో కొనసాగుతోంది.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Y7 News Telugu | ప్రజల గొంతుక








