E-PAPER

ఆదరణ గ్రామీణ వైద్యుల జిల్లా అధ్యక్షుడిగా జన్నారపు రమేష్

నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం

ములుగు జిల్లా, అక్టోబర్ 14 (Y7 న్యూస్ తెలుగు):

గోవిందరావుపేట మండలంలో ఆదరణ గ్రామీణ వైద్యుల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు బొబ్బా మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జన్నారపు రమేష్‌ను గ్రామీణ వైద్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జన్నారపు రమేష్ మాట్లాడుతూ.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని చోట ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ప్రజలకు ప్రథమ చికిత్స అందిస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ వైద్యుల సేవలను గుర్తించి, అర్హులైన వారికి ప్రభుత్వ శిక్షణ అందించి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి, వారి జీవనోపాధికి తోడ్పడే చర్యలు చేపట్టాలని ప్రయత్నాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గ్రామీణ వైద్యుల సమస్యలపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన వైద్యులు అందుబాటులో లేని పరిస్థితుల్లో, అర్హులైన ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపుతో కూడిన శిక్షణ అందించి, నిబంధనలకు అనుగుణంగా ప్రథమ చికిత్స సేవలు అందించేలా అవకాశాలు కల్పించాలని కోరారు. గ్రామీణ వైద్యుల జీవనోపాధికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో సీనియర్ గ్రామీణ వైద్యుడు హేమాద్రి, జిల్లా సలహాదారు వేణుగోపాల్, కార్యవర్గ సభ్యులు ఐలయ్య, శ్యాం, రాజేందర్, నాగరాజు, రమేష్, శివ, కుమారస్వామి, అజారొద్దీన్, వెంకటేశ్వర్లుతో పాటు మండలంలోని పలువురు గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

— Y7 News Telugu | ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!