చర్ల: భవాని మాల ధరించిన ఐదుగురు యువకులు స్నానం చేసేందుకు తాలిపేరు బ్రిడ్జి వద్దకు వెళ్లగా, వారిలో ఒకరు నీటిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న చర్ల ఎస్సై నర్సిరెడ్డి వెంటనే స్పందించి, పడవ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపు చర్యల్లో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గొల్లకట్ట గ్రామానికి చెందిన దగ్గుపల్లి వెంకటేష్ (తండ్రి: నర్సయ్య)గా గుర్తించారు.
అనంతరం వెంకటేష్ను చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
యువకుడి మృతితో గొల్లకట్ట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Y7 NEWS TELUGU | ప్రజల గొంతుక
Post Views: 33








