పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో మర్యాదపూర్వక భేటీ
పలాస, వై7 న్యూస్:
కాశీబుగ్గ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన జి.వి. రమణ సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ప్రజలకు పోలీసు శాఖ అందుబాటులో ఉండాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Post Views: 11









