పత్తికొండ అక్టోబర్ 12 కనకదిన్నె గ్రామానికి చెందిన రామకృష్ణ నూతన గృహ నిర్మాణ కార్యక్రమానికి బోయ వాల్మీకి సేన (బీవీఎస్) యూత్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామకృష్ణ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన, శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహేంద్ర నాయుడు మాట్లాడుతూ రామకృష్ణ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ, నిర్మించతలపెట్టిన గృహం సకల శుభాలను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కనకదిన్నె ఈరన్న, బొంతిరాళ్ల రామాంజనేయులు పాల్గొని రామకృష్ణ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక నాయకులు, బంధుమిత్రులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Post Views: 24









