E-PAPER

సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి

ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి: కంగాటి శ్రీదేవమ్మ

కర్నూలు జిల్లా, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, రానున్న ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కోరారు.

కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌కు ఆమె వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాగేలా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!