E-PAPER

రావులపల్లి రాంప్రసాద్ జన్మదినం సందర్భంగా క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం

చర్ల, అక్టోబర్ 09 (వై 7 న్యూస్);

భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సేవ్ ద ఓల్డ్ పూర్ సంస్థ ఆధ్వర్యంలో, తుమ్మల ప్రేమ్ కుమార్ సమన్వయంతో, హరి హరన్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ యాజమాన్యం మరియు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ప్రో. కుప్పాల సౌజన్య నిరంజన్ సహకారంతో సీతారామపురం గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు బుయ్యని చంద్రమ్మకు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ద్వారా రావులపల్లి రాంప్రసాద్ గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని అవసరమైన వారికి తోడ్పాటును అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ఇలాంటి మానవతా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!