పలాస: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న టి. భవాని కడప జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 8, గురువారం బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొన్ని నెలల క్రితమే కాశీబుగ్గ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భవాని, స్వల్ప వ్యవధిలోనే బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పలు నేరాలకు సంబంధించిన కేసులను ఛేదించడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.
బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో ఆమె కాశీబుగ్గ డివిజన్ నుంచి రిలీవ్ కానున్నట్లు పోలీసు వర్గాల సమాచారం.
— Y7 News Telugu | పలాస
Post Views: 19









