E-PAPER

కొత్త ఫీచర్లతో అడగొడుతున్న వాట్సప్..! మరో అదిరిపోయే ఫీచర్..

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన యూజర్ల కోసం, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘మెసేజ్ షెడ్యూలింగ్’ ఫీచర్‌ను ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై నిర్దిష్ట సమయం, తేదీని ముందే సెట్ చేసుకుని మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలను పంపించవచ్చు. వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్ చాట్లలోనూ ఈ సదుపాయం పనిచేస్తుంది. థర్డ్ పార్టీ యాప్‌లు, రిమైండర్లతో పనిలేకుండా నేరుగా యాప్ ద్వారానే మెసేజ్‌లను ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పించింది.

ఈ సరికొత్త ఫీచర్ ద్వారా పది నిమిషాల నుంచి గరిష్ఠంగా రెండు వారాల ముందు వరకు మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. చాట్ బాక్స్‌లో మెసేజ్ టైప్ చేసి లేదా మీడియా ఫైల్ జతచేసిన తర్వాత ‘సెండ్’ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. వెంటనే తేదీ, సమయం ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది. మెసేజ్ వెళ్లే సమయంలో పంపే వ్యక్తి ఆఫ్‌లైన్‌లో ఉన్నా లేదా ఫోన్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ కాకపోయినా నిర్దేశిత సమయానికి మెసేజ్ దానంతట అదే డెలివరీ అవుతుంది.

షెడ్యూల్ చేసిన టెక్స్ట్‌లు, లింకులు, ఫొటోలు, వీడియోలన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పూర్తి భద్రత కలిగి ఉంటాయి. అయితే డాక్యుమెంట్లకు ఈ సదుపాయం ఇంకా వర్తించదు. డెలివరీ కావడానికి ముందే చాట్ సమాచార విభాగంలో పెండింగ్ మెసేజ్‌లను చూసుకునే వీలుంది. ఆలోచన మారితే డెలివరీకి ముందే డిలీట్ కూడా చేసుకోవచ్చు. గ్రూప్‌లలో మెసేజ్ షెడ్యూల్ చేసిన సమయానికి ఉన్న సభ్యులకు మాత్రమే అది చేరుతుంది. కొత్తగా చేరేవారికి ఆ మెసేజ్ కనిపించదు. ప్రస్తుతం ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, త్వరలోనే దశలవారీగా అందరికీ లభించనుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!