E-PAPER

మహిళా సాధికారతకు బతుకమ్మ వేడుకలు ప్రతీక

మణుగూరు డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, అక్టోబర్ 8 (Y7 News Telugu): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలకు చిందులేసి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని చాటే ఈ పండుగ ప్రకృతితో మమేకమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

మహిళా సాధికారతతో పాటు విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై. చిన్నప్పయ్య, ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఆర్. వీణ, సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, జిల్లా నాయకులు దొబ్బల వెంకటప్పయ్య, ముఖ్య నాయకులు ఎస్. గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!