E-PAPER

రాయపర్తిలో బాధిత కుటుంబానికి SRR ఫౌండేషన్ ఆర్థిక సాయం

వరంగల్ ;
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రిజ్వనా బేగం కుటుంబాన్ని SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ తరఫున బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. మృతురాలి భర్త బిస్మిల్లా టైలర్ ఎండీ యాకూబ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రామ్ చందర్, సర్పంచ్ అభ్యర్థి చందు మల్లయ్య, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్, మాజీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి చందు రామ్, వార్డు నెంబర్ కుంట రాంబాబు, గారే యాకూబ్, గారే విష్ణు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!