E-PAPER

ప్రభుత్వ ఆసుపత్రి బాట పట్టిన తెలంగాణ రక్షణ సేన

ప్రజా సమస్యలపై జిల్లా అధ్యక్షుడు సముద్రాల క్రాంతికుమార్‌ క్షేత్రస్థాయి పరిశీలన

కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు, రోగుల సమస్యలపై ఆరా

కొత్తగూడెం, అక్టోబర్‌ 5 (Y7 న్యూస్):

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతోందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సముద్రాల క్రాంతికుమార్‌ అన్నారు. ఇందులో భాగంగా సోమవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించారు.
ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, బెడ్ల లభ్యత తదితర అంశాలపై రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రోగులకు అందాల్సిన మందులు, వైద్య సేవలు, మౌలిక వసతుల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని క్రాంతికుమార్‌ తెలిపారు. ప్రజల సమస్యలను కేవలం కార్యాలయాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.
కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే వరకు తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్మిక విభాగం (TRTU) రాష్ట్ర అధ్యక్షుడు డి. వీరన్న, మహిళా విభాగం నాయకురాలు దోనెపెల్లి కమల గాయత్రి, లకావత్‌ సురేష్‌, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి నమ్మి జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!