పలాస, అక్టోబర్ 05 (Y7 News Telugu): శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం బెండి గేటు సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సిగ్నల్ పోల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దీప్తి సాహూ (24), దిలీప్ నాయక్ (24) తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
Post Views: 10









