E-PAPER

ఉచిత శిక్షణ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ

కష్టపడితే విజయం తప్పక వరిస్తుంది

బంగారు భవిష్యత్తు కోసం అభ్యర్థులు నిత్యం శ్రమించాలి

నిరుద్యోగుల కోసం ములుగు జిల్లా అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్

ములుగు జిల్లా అక్టోబర్ 05 Y7 News Telugu

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క మరియు జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్ఖడే గార్ల సహకారంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల కేంద్రాన్ని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శిక్షణ అభ్యర్థులతో మాట్లాడుతూ శిక్షణ తరగతులు జరుగుతున్న తీరును అదేవిధంగా శిక్షణ ఏర్పాట్లలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ములుగు జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతమని ఈ జిల్లాలోని పేద అభ్యర్థులు పట్టణ ప్రాంతంలో శిక్షణ కోసం వెళ్లడం ఎంతో ఖర్చుతో కూడుకున్నదని అందువలన ఈ జిల్లా అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ గార్లతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పోలీస్ శాఖ భోజన వసతులతో కూడిన ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నదని, కావున జిల్లాలోని అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు శిక్షణ అభ్యర్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడు కష్టపడితే తప్పక వారి కల సాకారం అవుతుందని తెలియజేశారు అదేవిధంగా ఈ శిక్షణ తరగతులు కేవలం ప్రిలిమ్స్ పరీక్ష వరకే కాకుండా మెయిన్స్ పరీక్షలు నిర్వహించే వరకు నిర్వహిస్తామని అభ్యర్థులకు చివరి వరకు తోడుగా ఉంటామని భరోసానిచ్చారు ఈ జిల్లా నిరుద్యోగ అభ్యర్థులు కచ్చితంగా కష్టపడి జాబ్ సాధించాలని ఆకాంక్షించారు అనంతరం అధికారులతో కలిసి అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్ ఎస్బి ఇన్స్పెక్టర్ ప్రతాప్ ములుగు సిఐ సురేష్ ఆర్ ఐ స్వామి విశ్వ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ విశ్వనాథ్ ఎస్సై లు ఆర్ ఎస్ ఐ లు మరియు సిబ్బంది మరియు శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!