E-PAPER

బాపట్లలో గుంతలమయమైన రోడ్లు.. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం!

బాపట్ల జిల్లా, అక్టోబర్ 3 (Y7 న్యూస్):

బాపట్ల మండల పరిధిలోని పిన్నిపోయిన వారి పాలెం (పడమర) నుంచి తోటవారి పాలెం, వల్లువారి పాలెం వరకు రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్లపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడి, పైపొరలు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నీటితో నిండిన గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

విద్యార్థుల భద్రతపై ఆందోళన

ఈ మార్గంలో పాఠశాల బస్సులు, ఇతర వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. గుంతలతో నిండిన రహదారులపై విద్యార్థులు ప్రయాణించాల్సి రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు నెలకొన్నాయి.

రోడ్ల దుస్థితిపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చడంతో పాటు రహదారులకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల రాకపోకలకు సురక్షితమైన రహదారులను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల సమస్యలపై Y7 News Telugu గ్రౌండ్ రిపోర్ట్.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!