భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామన్నజారం జడ్పీ హైస్కూల్లో కలకలం రేగింది. 15 మందికి పైగా విద్యార్థులను హెడ్మాస్టర్ కొట్టినట్లు ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 51








