కోడిగుడ్డు పోషకాల ఘని. గుడ్డు తీసుకోవటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగ నిరోదశక శక్తిని పెంచటంలో గుడ్డు కు ఏదీ సాటి రాదు. అయితే, చాలా మంది మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్లో పెట్టి నిల్వ చేస్తారు. పదార్ధాలను ఫ్రిజ్ లో ఉంచి తినటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గుడ్ల విషయంలోనూ పలువురిలో అపోహలు ఉన్నాయి. దీంతో.. అసలు ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లు ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
కోడిగుడ్డు వినియోగం గణనీయంగా పెరిగింది. సాధారణంగా ప్రతీ ఇంటా గుడ్లను ఫ్రిజ్ లో వినియోగించటం కనిపిస్తుంది. గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఫ్రిజ్లో పెడతారు. అయితే, గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచి తినడం వల్ల, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు నిరూపించాయి. గుడ్లను ఫ్రిజ్లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకు పోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల గుడ్ల ద్వారా శరీరానికి లభించే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, సాధ్యమైనంత వరకు గుడ్లను ఫ్రిజ్లో పెట్టకుండా ఉండటం మంచిది. తప్పనిసరి అయితే, చాలా తక్కువ సమయం మాత్రమే ఫ్రిజ్లో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.








