మణుగూరు: రౌడీ షీటర్లు, అనుమానితులకు మణుగూరు డీఎస్పీ రవీంద్ర రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.

చెడు నడవడికకు దూరంగా ఉంటూ సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టాలను గౌరవించాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో డీఎస్పీ రవీంద్ర రెడ్డితో పాటు సీఐ నాగబాబు పాల్గొన్నారు.
Post Views: 64








