సినిమాల్లో నటుడిగా మంచి పేరు సంపాదించినా.. నిర్మాతగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చివరకు ఆర్థిక ఇబ్బందులకు దారితీశాయి. అప్పులు తీర్చేందుకు ఎంతో ఇష్టంగా చూసుకున్న కారును సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు సినిమా తొలి దశలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావు జీవితంలో ఈ ఘటన విషాద మలుపుగా నిలిచింది.
కస్తూరి శివరావు పేరు వినగానే పాత తరం తెలుగు ప్రేక్షకులకు హాస్యం గుర్తుకొస్తుంది. తెలుగు టాకీల తొలి తరానికి చెందిన ప్రముఖ హాస్య నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. నటనతో పాటు నేపథ్య గాయకుడిగా కూడా రాణించిన ఆయన.. సినిమాల నిర్మాణం, దర్శకత్వంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు.
1913 మార్చి 6న ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన కస్తూరి శివరావు.. అప్పటి తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. నటుడిగా వచ్చిన పేరు, సినీ రంగంలో ఆయన చేసిన ప్రయోగాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అయితే నిర్మాతగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు చివరకు ఆయన వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపాయి. ఇంతకీ ఆయనకు ఎదురైన ఆ పరిస్థితులు ఏంటి? అప్పులు తీర్చేందుకు కారు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.








