E-PAPER

అంతరిక్షంలో అమెరికా సరికొత్త అడుగు.. కక్ష్యలోనే స్పేస్ వెపన్స్ మోహరింపు

ఇప్పటివరకు అంతరిక్షం అంటే ఉపగ్రహాలు, పరిశోధనలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్పేస్ స్టేషన్లు మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు స్పేస్ డొమైన్‌ ప్రపంచ సైనిక వ్యూహాల్లో కీలక రంగంగా మారుతోంది. అమెరికా తొలిసారిగా అంతరిక్ష కక్ష్యలో పనిచేసే ‘ఆన్-ఆర్బిట్ స్పేస్ కంట్రోల్ వెపన్స్’ సామర్థ్యాలను మోహరించినట్లు వెల్లడించింది. దీంతో రష్యా, చైనాతో అమెరికా మధ్య అంతరిక్ష ఆధిపత్య పోటీ మరింత తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది.

అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కక్ష్యలోనే పనిచేసే స్పేస్ కంట్రోల్ ఆయుధ సామర్థ్యాలు అమెరికా వద్ద ఉన్నాయి. శత్రు దేశాల నుంచి వచ్చే చర్యలను ఎదుర్కొంటూ అమెరికా సైనిక బలగాలను రక్షించేందుకు ఈ సామర్థ్యాలు అవసరమని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ కార్యదర్శి ట్రాయ్ మీంక్‌ తెలిపారు. దీంతో అంతరిక్షాన్ని భవిష్యత్‌ సైనిక కార్యకలాపాల్లో కీలక వేదికగా మార్చే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అయితే అమెరికా అంతరిక్షంలో ఎలాంటి ఆయుధాలను మోహరించిందనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఆయుధాల పేర్లు, సంఖ్య, వాటి పూర్తి సామర్థ్యాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు. కేవలం ‘స్పేస్ కంట్రోల్’ కోసం ఈ సామర్థ్యాలను ఉపయోగించవచ్చని మాత్రమే స్పష్టం చేశారు. దీంతో అమెరికా మోహరించిన ఆయుధాలు ఏంటి? వాటి సామర్థ్యం ఎంత? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!