E-PAPER

ఆంధ్రలో బైక్‌లు చోరీ.. ఒడిశాలో విక్రయం.. ఇద్దరు అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా, పలాస, సెప్టెంబర్ 15 (వై7 న్యూస్):
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను సోంపేట పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని వెల్లడించారు.

సోంపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.73/2024, సెక్షన్ 303(2) BNS కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 14న సాయంత్రం సోంపేట మండలం బిరుసువాడ కాలనీ సమీపంలోని కంచిలి–సోంపేట రహదారి ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోనూ జరిగిన ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
అరెస్టైన నిందితులను ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన అద్దాలో సత్యనారాయణ ప్రధాన్ (32), అమిత్ సాహు (30)గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు అద్దాలో సత్యనారాయణ ప్రధాన్ గతంలో చెన్నైలో ఉద్యోగం చేసి, అనంతరం బరంపురంలో క్యాంటీన్ నిర్వహించాడు. పేకాట, ఆన్‌లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు అలవాటు పడిన అతడు ఆర్థిక అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌లో మోటార్ సైకిళ్లను దొంగిలించి ఒడిశాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. తాళాలు వేయకుండా ఉంచిన వాహనాలు, పాత మోడల్ బైక్‌లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఇక రెండో నిందితుడు అమిత్ సాహు బరంపురంలోని సెల్‌ఫోన్ రిపేరింగ్ దుకాణంలో పనిచేస్తూ, దొంగిలించిన వాహనాలను పరిచయస్తుల వద్ద తనఖా పెట్టి నగదు సమకూర్చే విధంగా ప్రధాన నిందితుడికి సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఇద్దరూ ఎలక్ట్రిక్ స్కూటీపై సోంపేట ప్రాంతానికి వచ్చి తిరిగి వెళ్తుండగా పోలీసుల తనిఖీలను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన విచారణలో A1 వద్ద నుంచి 10, A2 వద్ద నుంచి 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకుని మొత్తం 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు.
ఈ వాహనాలు సోంపేట, కంచిలి, కాశీబుగ్గ, మందస, ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు ఒడిశా రాష్ట్రంలోని రెండు కేసులకు సంబంధించినవిగా గుర్తించారు.
కేసును విజయవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సోంపేట సీఐ మంగరాజు, ఎస్సైలు మోహినీ, పారి నాయుడు మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!