E-PAPER

నీట్‌లో సత్తా చాటిన నివేదన్.. ఎంబీబీఎస్‌లో సీటు

పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన ఎస్ బి న్యూస్ CEO శ్రీరామ్ బృహస్పతి కుమారుడు నివేదన్ నీట్‌ (NEET) ఆల్ ఇండియా ర్యాంకులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. నీట్‌లో ప్రతిభ ఆధారంగా మహేశ్వరం మెడికల్ కాలేజీ, పటాన్‌చెరువులో ఎంబీబీఎస్‌ సీటుకు నివేదన్ ఎంపికయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, పట్టుదలతో కృషి చేసిన నివేదన్ జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం గ్రామానికి చెందిన విద్యార్థి నీట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వైద్య విద్యలో ప్రవేశం పొందడం గ్రామానికి గర్వకారణమని పలువురు అభినందించారు. భవిష్యత్తులో వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. నివేదన్ విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం, అతని నిరంతర శ్రమే ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!