మణుగూరు: మండల వాసవీక్లబ్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలకు మట్టి గణేశ్ విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దోసపాటి నాగేశ్వరరావు ప్రారంభించగా, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసవీక్లబ్ అధ్యక్షుడు శ్యామ్ మాట్లాడుతూ… ప్రతి ఏటా పర్యావరణాన్ని పరిరక్షించాలని మట్టి గణపయ్య మణుగూరు ప్రజలకు విఘ్నాలు తొలిగించి విజయాలు చేకూర్చాలని గణేశ్ విగ్రహాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. దశాబ్దం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వారామంగా కొనసాగిస్తున్నామన్నారు. ఈ ఏడాది 800 మట్టి విగ్రహాలు, వ్రత కథ పుస్తకాలు అందజేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినియోగం నిరోధించడంలో పర్యావరణ పరిరక్షణలో మా వంతు కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు దోసపాటి క్రాంతి, ఐపిసీ లు కడవెండి విశ్వనాథ గుప్తా, బండారు నర్సింహారావు, చిత్తలూరి రమేశ్ బాబు, చిట్టూరి శేషు కుమార్, దుగ్గి సతీష్, సంకా రాధా శ్యాంగుప్తా, బొడ్డు పుల్లారావు, గౌరీశంకర్, సుగ్గల సూర్యం, బ్రహ్మాజీ తదితరులు ఉన్నారు.








