శ్రీకాకుళం జిల్లా పలాస, సెప్టెంబర్ 11 (వై7 న్యూస్):
ఏడు సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా జైలుకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గుంజిలోవ గ్రామానికి చెందిన కవిటి రామారావు (74)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 9వ తేదీన కొత్తపేటలోని ఓ కాలనీలో నివసిస్తున్న 7 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 7 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు.
కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.









